తమ పేమెంట్ అవసరాలన్నింటి కోసం Google Payని ఉపయోగిస్తున్న కోట్లాది మంది భారతీయులలో చేరండి. Google అందిస్తోన్న సులభమైన, సురక్షితమైన పేమెంట్‌ల యాప్ Google Pay. స్నేహితులను రెఫర్ చేయండి, ఆఫర్‌లను పొందండి. అంతే కాక, పేమెంట్ చేసేటప్పుడు రివార్డ్‌లను పొందండి.
మీరు చేయాల్సిందల్లా ఈ యాప్‌లో మీ బ్యాంక్ ఖాతాను మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లింక్ చేసి, దీన్ని వినియోగించడం ప్రారంభించడమే.
UPI ID అనేది బ్యాంక్ ఖాతా వివరాలకు బదులుగా, UPI పేమెంట్‌లు చేయడానికి ఉపయోగించే ఒక యూనిక్ ID.
UPI PIN అనేది 4 లేదా 6 అంకెల సంఖ్య, ఇది మీ UPI IDని క్రియేట్ చేసేటప్పుడు మీరు సెట్ చేయాలి. దయచేసి మీ PINని ఎవరికీ షేర్ చేయకండి.
+ మీ బ్యాంక్ నుండి, అలాగే Google నుండి పలు లేయర్‌ల సెక్యూరిటీ
మీరు కష్టపడి సంపాదించిన డబ్బు మీ బ్యాంక్ ఖాతాలో సురక్షితంగా ఉంచబడుతుంది. అంతే కాక మీ బ్యాంక్ ఖాతా నుండి బయటకు పంపే డబ్బుపై మీకు కంట్రోల్ ఉంటుంది*. మోసం, ఇంకా హ్యాకింగ్‌లను గుర్తించడంలో సహాయపడే ప్రపంచ-స్థాయి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశాం, మీ డబ్బును సురక్షితంగా ఉంచడానికి మేము కట్టుబడి ఉన్నాం. మీ పేమెంట్ సమాచారాన్ని రక్షించడానికి మేము మీ బ్యాంక్‌తో కలిసి పని చేస్తాము.
ప్రతి లావాదేవీ మీ UPI PINతో సురక్షితం చేయబడుతుంది. మీ వేలిముద్ర వంటి పరికర లాక్ పద్ధతితో మీరు మీ ఖాతాను సురక్షితంగా కాపాడుకోవచ్చు.
*BHIM UPIకి సపోర్ట్ ఇచ్చే భారతదేశంలోని అన్ని బ్యాంక్‌లతో Google Pay పని చేస్తుంది.
+ DTH, బ్రాడ్‌బ్యాండ్, ఎలక్ట్రిసిటీ, FASTag, LPG బిల్లులతో పాటు మరికొన్ని బిల్లులను సౌకర్యవంతంగా పే చేయండి
మీ బిల్లర్ ఖాతాలను ఒకసారి లింక్ చేస్తే చాలు, కొన్ని ట్యాప్‌లతోనే మీ బిల్లును పే చేయగలిగేలా మేము మీకు గుర్తు చేస్తుంటాము. దేశవ్యాప్తంగా ఉన్న బిల్లర్‌లతో Google Pay పని చేస్తుంది.
+ తాజా ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను వెతికి మీ మొబైల్‌కు సులభంగా రీఛార్జ్ చేయండి
తక్కువ దశల్లో, అదనపు ఛార్జీలేవీ లేకుండా రీఛార్జ్ చేయండి.
+ మీ బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్‌ను చెక్ చేయండి
మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను చూడటానికి ATMకి వెళ్లాల్సిన అవసరం లేదు, ఎప్పుడైనా సులభంగా చూడండి.
+ రివార్డ్ పొందండి
స్నేహితులను రెఫర్ చేయండి, ఆఫర్‌లను పొందండి. అంతే కాక, పేమెంట్ చేస్తున్నప్పుడు మీ బ్యాంక్ ఖాతాలోకి క్యాష్ రివార్డ్‌లను పొందండి.
+ QR కోడ్ పేమెంట్‌లు
మీకు ఇష్టమైన ఆఫ్‌లైన్ షాప్‌లకు, వ్యాపారులకు QR కోడ్ స్కానర్ ద్వారా పేమెంట్ చేయండి.
+ టిక్కెట్లు బుక్ చేసుకోండి, ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయండి, ఇంకా భోజనం ఆర్డర్ చేయండి
నేరుగా యాప్‌లో లేదా Zomato, redBus, MakeMyTrip మొదలైన పార్ట్‌నర్ వెబ్‌సైట్‌లు, యాప్‌లలో మీ ఫేవరేట్ ఫుడ్‌ను ఆర్డర్ చేయండి, ఇంకా మీ ట్రావెల్‌ను బుక్ చేసుకోండి.
+ మీ డెబిట్ ఇంకా క్రెడిట్ కార్డ్‌లతో వేగవంతమైన, సురక్షితమైన పేమెంట్‌లు
Google Payలో మీ డెబిట్ ఇంకా క్రెడిట్ కార్డ్‌లను** యాడ్ చేసి, లింక్ చేసి వీటి కోసం ఉపయోగించండి:
- ఆన్‌లైన్ పేమెంట్‌లు (మొబైల్ రీఛార్జ్‌ల కోసం లేదా ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా)
- ఆఫ్‌లైన్ పేమెంట్‌లు (ఆఫ్‌లైన్ షాప్‌లలోని NFC టెర్మినల్స్‌లో మీ ఫోన్‌ను ట్యాప్ చేయడం ద్వారా)
**పలు బ్యాంక్ మంజూరుదారులు, కార్డ్ నెట్‌వర్క్ ప్రొవైడర్‌లతో పని చేసేలా ఈ సర్వీస్ రిలీజ్ ప్రాసెస్ అవుతోంది.
+ 24 క్యారెట్ల బంగారాన్ని కొనండి, విక్రయించండి, సంపాదించండి
MMTC-PAMP మద్దతు ఉన్న రేట్‌లతో బంగారాన్ని సురక్షితంగా ట్రేడింగ్ చేయండి. Google Payలోని మీ గోల్డ్ లాకర్‌లో మీ బంగారం సురక్షితంగా డిపాజిట్ చేయబడుతుంది లేదా బంగారు నాణేలుగా మీ ఇంటికి డెలివరీ చేయబడుతుంది. కొత్త ఫీచర్! ఇప్పుడు మీరు Google Pay రివార్డ్‌ల ద్వారా బంగారాన్ని సంపాదించవచ్చు.
+ UPI బదిలీల ద్వారా Google Payలో లేని వారితో సహా ఎవరి బ్యాంక్ ఖాతాకు అయినా మీ బ్యాంక్ ఖాతా నుండి నేరుగా డబ్బు పంపండి
NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) BHIM యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (BHIM UPI)ని ఉపయోగించడం ద్వారా డబ్బు బదిలీల ప్రాసెస్ Google Payతో సరళంగా, సురక్షితంగా ఉంటుంది.
+ లోన్‌లు అందించబడతాయి
- రుణదాతలు: DMI Finance
- తిరిగి పేమెంట్ చేయాల్సిన వ్యవధి: 3-48 నెలలు
- గరిష్ఠ వార్షిక వడ్డీ రేటు శాతం (APR): 34%
- ప్రాసెసింగ్ ఫీజు: రుణ మొత్తంలో 1.5-2.5%
ఉదాహరణకు: INR 100,000 రుణ మొత్తానికి, 12 నెలల కాలవ్యవధి, ప్రాసెసింగ్ ఫీజు 2%, వడ్డీ 15%. ప్రాసెసింగ్ ఫీజు కింద INR 2000 మినహాయించి, INR 98000 రుణం బదిలీ చేయబడుతుంది. INR 8310 వడ్డీ. యూజర్ INR 108310 పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
అప్‌డేట్ అయినది
4 ఆగ, 2025