Google Play సేవా నిబంధనలు
ఆగస్ట్ 4, 2020
1. పరిచయం
వర్తించే నిబంధనలు. Google Playని ఉపయోగించినందుకు ధన్యవాదాలు. Google Play అన్నది Google LLC అందించిన సేవ ("Google", "మేము" లేదా "మాకు"), ఇది 1600 Amphitheatre Parkway, Mountain View California 94043, USA చిరునామాలో ఉంది. మీ Google Play మరియు యాప్‌లు (Android తక్షణ యాప్‌లతో సహా), గేమ్‌లు, సంగీతం, చలనచిత్రాలు, పుస్తకాలు, వార్తా పత్రికలు లేదా ఇతర డిజిటల్ కంటెంట్ లేదా సేవల ("కంటెంట్"గా సూచించబడతాయి) వినియోగం ఈ Google Play సేవా నిబంధనలు మరియు Google సేవా నిబంధనలు ("Google ToS") ( మొత్తంగా "నిబంధనలు"గా సూచించబడతాయి)కు లోబడి ఉంటూ అందుబాటులో ఉంటాయి. Google Play అన్నది Google ToSలో వివరించిన విధంగా ఒక "సేవ". Google Play సేవా నిబంధనలు మరియు Google ToSకి మధ్య ఏదైనా వైరుధ్యం ఉంటే, Google Play సేవా నిబంధనలు అమలవుతాయి.
2. Google Play యొక్క మీ వినియోగం
కంటెంట్‌కి యాక్సెస్ మరియు దాని వినియోగం. మీ మొబైల్, కంప్యూటర్, టీవీ, వాచ్ లేదా ఇతర మద్దతు ఉన్న పరికరం కోసం కంటెంట్‌ని బ్రౌజ్ చేయడానికి, గుర్తించడానికి, చూడడానికి, ప్రసారం చేయడానికి మీరు Google Playని ఉపయోగించవచ్చు ("పరికరం"). Google Playని ఉపయోగించడానికి, మీరు సంబంధిత కంటెంట్, పనిచేసే ఇంటర్నెట్ యాక్సెస్ మరియు అనుకూలమైన సాఫ్ట్‌వేర్ వంటి సిస్టమ్ మరియు అనుకూలత అవసరాలకు అనుగుణంగా ఉండే పరికరాన్ని కలిగి ఉండాలి. కంటెంట్ మరియు ఫీచర్‌ల లభ్యత దేశానికి, దేశానికి మారుతూ ఉంటుంది, మొత్తం కంటెంట్ లేదా ఫీచర్‌లు మీ దేశంలో అందుబాటులో లేకపోవచ్చు. కుటుంబ సభ్యులతో షేర్ చేయడానికి కొంత కంటెంట్ అందుబాటులో ఉండవచ్చు. కంటెంట్ Google ద్వారా అందించబడి ఉండవచ్చు లేదా Googleతో అనుబంధం లేని మూడవ పక్షాల ద్వారా అందుబాటులోకి వచ్చి ఉండవచ్చు. Google యేతర మూలాధారం నుండి వచ్చి Google Play ద్వారా అందుబాటులోకి తెచ్చిన కంటెంట్‌కి Google బాధ్యత వహించదు మరియు దాన్ని ఆమోదించదు.
వయో పరిమితులు. మీరు Google Playని ఉపయోగించడానికి, మీరు వయో పరిమితులకు లోబడి ఉంటూ చెల్లుబాటు అయ్యే Google ఖాతాను ("Google ఖాతా") కలిగి ఉండాలి. మీరు మీ దేశంలో చిన్నవారిగా పరిగణించబడితే, Google Playని ఉపయోగించడానికి మరియు నిబంధనలను అంగీకరించడానికి మీరు మీ తల్లిదండ్రుల లేదా చట్టపరమైన సంరక్షకుల అనుమతిని కలిగి ఉండాలి. Google Playలో నిర్దిష్టమైన కంటెంట్ లేదా ఫీచర్‌లను ఉపయోగించడానికి వర్తించబడే ఏవైనా అదనపు వయో పరిమితులకు మీరు లోబడి ఉండాలి. కుటుంబ నిర్వాహకులు మరియు కుటుంబ సభ్యులు ఈ అదనపు అవసరాలు కూడా కలిగి ఉండాలి.
మూడవ పక్ష రుసుము. కంటెంట్ మరియు Google Play వినియోగం, వీక్షణకు సంబంధించి మూడవ పక్షాల (మీ ఇంటర్నెట్ ప్రదాత లేదా మొబైల్ క్యారియర్ వంటివి) నుండి ఏదైనా యాక్సెస్ లేదా డేటా రుసుము విధించబడితే మీరు బాధ్యత వహిస్తారు.
అప్‌డేట్‌లు. Google Play, సంబంధిత మద్దతు లైబ్రరీలు లేదా కంటెంట్‌ని అప్‌డేట్ చేయాల్సి రావచ్చు, ఉదాహరణకు బగ్ పరిష్కారాలు, మెరుగుపరిచిన ఫంక్షన్‌లు, కోల్పోయిన ప్లగ్-ఇన్‌లు మరియు కొత్త వెర్షన్‌ల కోసం (మొత్తంగా, "అప్‌డేట్‌లు"). మీరు Google Playని ఉపయోగించడానికి లేదా కంటెంట్‌ని యాక్సెస్ చేయడానికి, డౌన్‌లోడ్ చేయడానికి లేదా ఉపయోగించడానికి ఇలాంటి అప్‌డేట్‌ల అవసరం ఉండవచ్చు. ఈ నిబంధనలను అంగీకరించడం మరియు Google Playని ఉపయోగించడం వల్ల, మీరు అలాంటి అప్‌డేట్‌లను స్వయంచాలకంగా స్వీకరించడానికి అంగీకరిస్తున్నారు. మీరు Google Playలోని సెట్టింగ్‌ల ద్వారా అలాంటి కంటెంట్‌లకు అప్‌డేట్‌లను నిర్వహించగలరు. అది గుర్తించబడితే, అయినప్పటికీ, కంటెంట్‌కు సంబంధించి క్లిష్టమైన దుర్బలత్వాన్ని ఈ అప్‌డేట్ పరిష్కరిస్తుంది, Google Play లేదా మీ పరికరంలో మీ అప్‌డేట్ సెట్టింగ్‌లకు సంబంధం లేకుండా అప్‌డేట్ పూర్తి కావచ్చు. ప్రారంభంలో Google Play నుండి డౌన్‌లోడ్ చేసిన కంటెంట్‌ని అప్‌డేట్ చేయడానికి మరో యాప్ స్టోర్ ప్రయత్నిస్తే, మీరు హెచ్చరికను స్వీకరిస్తారు లేదా అలాంటి అప్‌డేట్‌లు మొత్తంగా నిరోధించబడతాయి.
మీ గురించి సమాచారం. మీరు Google Playని ఉపయోగిస్తున్నప్పుడు మీ వ్యక్తిగత డేటాను మరియు మీ గోప్యతను మేము ఎలా సంరక్షిస్తామో Google యొక్క గోప్యతా విధానాలు వివరిస్తాయి. మీ లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి లేదా కంటెంట్‌ని మీకు కేటాయించడానికి మీ పేరు, ఇమెయిల్ చిరునామా వంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని ప్రదాతలకు అందించడం అనేది Googleకి అవసరం అవవచ్చు. గోప్యతా విధానాలకు అనుగుణంగా ఈ సమాచారాన్ని ఉపయోగించడానికి ప్రదాతలు అంగీకరిస్తారు.
మీరు Google Playలోని కుటుంబ సమూహంలో భాగమైతే, మీకు సంబంధించిన నిర్దిష్ట సమాచారాన్ని మీ కుటుంబ సమూహంలోని కుటుంబ సభ్యులు చూడగలుగుతారు. Google Playలోని కుటుంబ సమూహానికి మీరు కుటుంబ నిర్వాహకులైతే, మీరు ఆహ్వానించే కుటుంబ సభ్యులు మీ పేరు, ఫోటో మరియు ఇమెయిల్ చిరునామాను చూడగలుగుతారు. మీరు కుటుంబ సమూహంలో కుటుంబ సభ్యుడిగా చేరితే ఇతర కుటుంబ సభ్యులు మీ పేరు, ఫోటో మరియు ఇమెయిల్ చిరునామాను చూడగలుగుతారు. మీ కుటుంబ నిర్వాహకులు కూడా మీ వయస్సును చూడవచ్చు మరియు కుటుంబ చెల్లింపు పద్ధతిని ఉపయోగించి మీరు చేసే అన్ని కొనుగోళ్ల రికార్డును, కొనుగోలు చేయబడిన కంటెంట్ వివరణతో సహా చూడవచ్చు. కుటుంబంతో షేర్ చేయడానికి కంటెంట్ అందుబాటులో ఉండి, మీరు దాన్ని మీ కుటుంబ సమూహంతో షేర్ చేస్తే, ఆపై కుటుంబ సభ్యులందరూ కంటెంట్‌ని యాక్సెస్ చేయగలరు మరియు దాన్ని మీరు కొనుగోలు చేసినట్టు చూడగలరు.
ఖాతాలకు ప్రామాణీకరించని యాక్సెస్. మీ ఖాతా వివరాలను మీరు సురక్షితంగా ఉంచుకోవాలి మరియు వాటిని ఎవరితోనూ షేర్ చేయవద్దు. మీరు ఖాతా పేర్లతో సహా Google Play యొక్క వినియోగదారు లేదా Google Play ద్వారా ఇతర Google సేవల యొక్క వినియోగదారుకు సంబంధించిన ఏమైనా వ్యక్తిగత డేటాను మీరు సేకరించకూడదు.
నిలిపివేసిన ఖాతాలు. నిబంధనలకు (ఉదాహరణకు మీరు నిబంధనలను ఉల్లంఘిస్తే) అనుగుణంగా Google మీ ఖాతాకు యాక్సెస్‌ని నిలిపివేస్తే మీరు Google Playని, మీ ఖాతా వివరాలను లేదా మీ ఖాతాతో నిల్వ చేసిన ఏవైనా ఫైళ్లు, ఇతర కంటెంట్‌ని యాక్సెస్ చేయకుండా మీరు నిరోధించబడతారు. మరింత సమాచారం కోసం సహాయ కేంద్రాన్ని చూడండి. మీరు Google Playలోని కుటుంబం యొక్క నిర్వాహకులు అయితే మరియు Google మీ ఖాతాను నిలిపివేస్తే, మీ కుటుంబ సభ్యులు కుటుంబ సమూహం అవసరమయ్యే కుటుంబ చెల్లింపు పద్ధతి, కుటుంబ సభ్యత్వాల వంటి కుటుంబ ఫీచర్‌లకు లేదా కుటుంబ సభ్యుల ద్వారా షేర్ చేయబడిన కంటెంట్‌కు యాక్సెస్‌ని కోల్పోతారు. మీరు Google Playలోని కుటుంబం యొక్క నిర్వాహకులు అయితే మరియు Google మీ ఖాతాను నిలిపివేస్తే, మీరు షేర్ చేసిన కంటెంట్ యొక్క యాక్సెస్‌ని మీ కుటుంబ సభ్యులు కోల్పోతారు.
మాల్‌వేర్ రక్షణ. హానికరమైన మూడవ పక్ష సాఫ్ట్‌వేర్, URLలు మరియు ఇతర భద్రతా సమస్యల నుండి మిమ్మల్ని రక్షించడానికి Google మీ పరికర నెట్‌వర్క్ కనెక్షన్‌లు, సంభావ్యంగా హానికరమైన URLలు, ఆపరేటింగ్ సిస్టమ్ మరియు మీ పరికరంలో Google Play లేదా ఇతర మూలాల నుండి ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లకు సంబంధించిన సమాచారాన్ని స్వీకరించవచ్చు. ఒక యాప్ లేదా URL సురక్షితం కాదని పరిగణించబడితే Google మిమ్మల్ని హెచ్చరించవచ్చు, లేదా అది పరికరాలకు, డేటాకు లేదా వినియోగదారులకు హానికరమైనదైతే Google దాన్ని మీ పరికరం నుండి తీసివేస్తుంది లేదా దాని ఇన్‌స్టాలేషన్‌ని బ్లాక్ చేస్తుంది. మీ పరికరంలోని సెట్టింగ్‌లలో ఈ రక్షణల్లోని కొన్నింటిని నిలిపివేయడానికి మీరు ఎంచుకోవచ్చు, అయినప్పటికీ, Google Play ద్వారా ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లకు సంబంధించిన సమాచారాన్ని Google స్వీకరించడం కొనసాగిస్తుంది మరియు భద్రతా సమస్యల కారణంగా మీ పరికరంలో ఇతర మూలాధారాల నుండి ఇన్‌స్టాల్ చేసిన యాప్‌ల విషయంలో సమాచారాన్ని Googleకి పంపించకుండానే అవి విశ్లేషించబడతాయి.
Android తక్షణ యాప్‌లు. మీరు మీ పరికరంలో లింక్‌పై క్లిక్ చేస్తే వర్తించే తక్షణ యాప్ ఉందో లేదో Google Play తనిఖీ చేయవచ్చు, ఒకవేళ ఉంటే తక్షణ యాప్‌లోనే లింక్‌ను తెరుస్తుంది. మీరు యాక్సెస్ చేసే తక్షణ యాప్ యొక్క విభాగాలను అమలు చేయడానికి అవసరమయ్యే కోడ్ ఏదైనా మీ పరికరంలో డౌన్‌లోడ్ చేయబడుతుంది మరియు దానిలో తాత్కాలికంగా ఉంచబడుతుంది. తక్షణ యాప్ కోసం యాప్ వివరాలు Google Play స్టోర్‌లో కనుగొనబడతాయి. Android తక్షణ యాప్‌లు మరియు సెట్టింగ్‌లు Google ఖాతాతో సైన్ ఇన్ చేసిన పరికరాలకు సమకాలీకరించబడతాయి. మీరు మీ పరికరంలోని సెట్టింగ్‌లలో Android తక్షణ యాప్‌లను నిలిపివేయడానికి ఎంచుకోవచ్చు.
ఈ నిబంధనలకు మార్పులు. నిబంధనలు మారితే, మీకు కనీసం 30 రోజుల ముందు నోటీసు ఇవ్వబడుతుంది మరియు కొత్త నిబంధనలు ఆ నోటీసు వ్యవధి తరువాత ప్రభావితమవుతాయి. నోటీసు కాలం పూర్తయిన తర్వాత కూడా మీరు Google Playని ఉపయోగించడాన్ని కొనసాగిస్తే మీరు కొత్త నిబంధనలను అంగీకరించారని అర్థం. కొత్త నిబంధనలు మీ మొత్తం కంటెంట్ (గతంలో మీరు ఇన్‌స్టాల్ చేసిన లేదా కొనుగోలు చేసిన కంటెంట్‌తో సహా) యొక్క వినియోగానికి మరియు ఆ తదుపరి ఇన్‌స్టాల్‌లకు మరియు కొనుగోళ్లకు వర్తిస్తాయి. మీరు అలాంటి మార్పులను అంగీకరించకపోతే, మీరు ఇంతకుముందు కొనుగోలు చేసిన లేదా ఇన్‌స్టాల్ చేసిన కంటెంట్‌ని డౌన్‌లోడ్ చేసే అవకాశం మీకు కల్పించబడుతుంది మరియు Google Play యొక్క మీ వినియోగం రద్దు చేయబడుతుంది. మీరు అంగీకరించిన గత నిబంధనలకు అనుగుణంగా మీ పరికరాల్లో కంటెంట్ కాపీని చూడడాన్ని మీరు కొనసాగించవచ్చు.
3. కొనుగోళ్లు మరియు చెల్లింపులు
ఉచిత కంటెంట్. Google Playలో కంటెంట్‌ని ఉచితంగా డౌన్‌లోడ్ చేయడానికి, చూడడానికి లేదా ఉపయోగించడానికి Google మిమ్మల్ని అనుమతిస్తుంది. ఉచిత కంటెంట్ యొక్క మీ యాక్సెస్ మరియు వినియోగానికి అదనపు పరిమితులు వర్తించవచ్చు.
కంటెంట్ కొనుగోలు. మీరు Google Playలో లేదా దాన్ని ఉపయోగించి కంటెంట్‌ని కొనుగోలు చేస్తే ఈ నిబంధనల (వర్తించే విధంగా) ఆధారంగా మీరు విక్రేతతో ప్రత్యేక విక్రయ ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు, అవి వీటిలో ఏవైనా కావచ్చు:
(a) Google Ireland Limited; లేదా
(b) కంటెంట్ ప్రదాత ("ప్రదాత"), ప్రదాతకు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న Google Ireland Limitedతో సహా.
ఈ నిబంధనలకు అదనంగా ప్రత్యేక విక్రయ ఒప్పందం ఉంటుంది.
ప్రదాత కోసం Google అనేది ఏజెంట్‌గా పనిచేసే చోట విక్రయాల కోసం Google ToSలోని Google ToS "ఎలాంటి మూడవ పక్ష లబ్ధిదారుల హక్కులనూ సృష్టించదు" అనే ప్రకటన మీ Google Play వినియోగానికి వర్తించదు.
కంటెంట్ కొనుగోలు చేసినట్టు నిర్ధారణతో కూడిన ఇమెయిల్‌ని మీరు Google నుండి స్వీకరించిన తర్వాత కొనుగోలు కోసం మరియు కంటెంట్ యొక్క వినియోగం కోసం మీ ఒప్పంద ప్రక్రియ పూర్తవుతుంది మరియు కొనుగోలు పూర్తయిన వెంటనే ఈ ఒప్పందం యొక్క అమలు ప్రారంభమవుతుంది.
ముందస్తు ఆర్డర్‌లు. మీరు కంటెంట్ కోసం ముందస్తు ఆర్డర్ చేసినప్పుడు, అది మీకు అందుబాటులోకి వచ్చినప్పుడు కొనుగోలు కోసం మరియు ఆ అంశం యొక్క వినియోగం కోసం మీ ఒప్పంద ప్రక్రియ పూర్తవుతుంది, ఆ సమయంలో కొనుగోలు కోసం మీకు ఛార్జీ విధించబడుతుంది. కంటెంట్ మీకు అందుబాటులోకి వచ్చే లోపు ఏ సమయంలోనైనా మీరు మీ ముందస్తు ఆర్డర్‌ని రద్దు చేసుకోవచ్చు. కంటెంట్ మీకు అందుబాటులోకి వచ్చే లోపు Google Playలో విక్రయం నుండి ఉపసంహరించబడితే మేము మీ ముందుస్తు ఆర్డర్‌ని రద్దు చేయాల్సి ఉంటుంది మరియు మీ ఆర్డర్ పూర్తయ్యేలోగా ధర మారిన సందర్భంలో మీ ఆర్డర్‌ని రద్దు చేసే అధికారం మాకు ఉంది.
కుటుంబ చెల్లింపు పద్ధతి. మీరు Google Playలో కుటుంబ సభ్యుల సమూహానికి కుటుంబ నిర్వాహకుడు అయితే, మీరు మీ కుటుంబ సభ్యుల కోసం Google Play మరియు యాప్‌ల్లో కంటెంట్‌ను కొనుగోలు చేసేందుకు ఉపయోగించడానికి చెల్లుబాటు అయ్యే కుటుంబ చెల్లింపు పద్ధతిని సెటప్ చేయాలి. కుటుంబ చెల్లింపు పద్ధతిని ఉపయోగించి మీ కుటుంబ సభ్యులందరూ చేసే కంటెంట్ కొనుగోళ్లు అన్నింటికీ మీరు బాధ్యత వహిస్తారు. కుటుంబ సమూహం తొలగించబడితే, లేదా ఒక కుటుంబ సభ్యుడు కుటుంబ సమూహం నుండి నిష్క్రమిస్తే కుటుంబ చెల్లింపు పద్ధతిని ఉపయోగించి కుటుంబ సభ్యులు చేసిన పెండింగ్ కొనుగోళ్ల కోసం మీకు ఛార్జీ విధించబడుతుంది.
Google చెల్లింపులు. Google Play నుండి కంటెంట్‌ని కొనుగోలు చేయాలంటే, మీరు Google చెల్లింపుల ఖాతాను కలిగి ఉండాలి మరియు Google చెల్లింపుల సేవా నిబంధనలను అంగీకరించాలి. Google చెల్లింపుల ఖాతాను ఉపయోగించి మీరు కొనుగోలు చేసినప్పుడు Google చెల్లింపుల గోప్యతా నోటీసు వర్తిస్తుంది. మీ Google చెల్లింపుల ఖాతాలో Google Play ద్వారా చేసిన కొనుగోళ్లకు సంబంధించి చెల్లించాల్సిన డబ్బు మొత్తానికి మీదే బాధ్యత.
ఇతర చెల్లింపు ప్రాసెసింగ్ పద్ధతులు. Google Play ద్వారా కంటెంట్‌ను కొనుగోలును చేయడానికి, మీకు Google అదనంగా విభిన్న చెల్లింపు ప్రాసెసింగ్ పద్ధతులను అందుబాటులో ఉంచవచ్చు. ఇచ్చిన చెల్లింపు ప్రాసెసింగ్ పద్ధతి యొక్క మీ వినియోగాన్ని పర్యవేక్షించే Google లేదా మూడవ పక్షానికి సంబంధించి ఉండే ఏవైనా సంబంధిత నిబంధనలు మరియు షరతులకు లేదా చట్టబద్ధ ఒప్పందానికి మీరు కట్టుబడి ఉండాలి. Google తన స్వంత అభీష్టానుసారం చెల్లింపు ప్రాసెసింగ్ పద్ధతులను జోడించవచ్చు లేదా తొలగించవచ్చు. Google Playలో మీరు చేసిన కొనుగోళ్లకు సంబంధించి చెల్లించాల్సిన డబ్బు మొత్తానికి మీదే బాధ్యత.
క్యారియర్ బిల్లింగ్ అర్హత. మీరు ఒక పరికరంపై Google Play ఖాతాను సృష్టించినప్పుడు, మీ ప్రదాత ఖాతాకు బిల్ చేసిన మీ పరికరాలలో మీరు కంటెంట్‌ను కొనుగోళ్లు చేయడానికి మీ అర్హతను గుర్తించడానికి, మేము మీ నెట్‌వర్క్ ప్రదాతకు మీ పరికర ఐడెంటిఫైయర్‌లను పంపుతాము, ఉదా., సభ్యుని ID మరియు సిమ్ కార్డ్ క్రమ సంఖ్య. దీన్ని అనుమతించడానికి నెట్‌వర్క్ ప్రదాత యొక్క సేవా నిబంధనలను మీరు అంగీకరించాలి. నెట్‌వర్క్ ప్రదాత మాకు మీ బిల్లింగ్ చిరునామాను పంపవచ్చు. Google యొక్క గోప్యతా విధానాలు మరియు Google చెల్లింపుల గోప్యతా నోటీసుకు అనుగుణంగా మేము ఈ సమాచారాన్ని కలిగి ఉంటాము మరియు ఉపయోగిస్తాము.
ధర. Google Play ద్వారా ప్రదర్శితమైన మొత్తం కంటెంట్ యొక్క ధర మరియు లభ్యత అనేవి కొనుగోలుకు ముందు ఏ సమయంలోనైనా మారవచ్చు.
పన్నులు. "పన్నులు" అంటే ఏమైనా సంబంధిత జరిమానాలు లేదా వడ్డీలతో సహా కంటెంట్ విక్రయంతో అనుబంధించబడిన ఏమైనా విధులు, కస్టమ్స్ రుసుములు, సుంకాలు లేదా పన్నులు (ఆదాయం పన్ను కాకుండా). ఎలాంటి పన్నులకైనా మీరు బాధ్యత వహించాలి మరియు మీరు పన్నుల కోసం ఎటువంటి తగ్గింపు లేకుండా కంటెంట్‌కు ఖచ్చితంగా చెల్లించాలి. కంటెంట్ యొక్క విక్రేత లేదా Google పన్నులు చెల్లించాల్సిందిగా నిర్ణయిస్తే, మీకు పన్నులు విధించబడతాయి. Google Play యొక్క మీ వినియోగం లేదా Google Play ద్వారా లేదా Google Playలో కంటెంట్ యొక్క కొనుగోలుకు సంబంధించి ఉత్పన్నమయ్యే పన్నుల యొక్క నివేదన మరియు చెల్లింపుతో పాటు ఏవైనా మరియు అన్ని వర్తించే పన్ను చట్టాలకు మీరు కట్టుబడి ఉండాలి. అలాంటి ఏవైనా వర్తించే పన్నుల చెల్లింపు బాధ్యత మీదే.
అన్ని విక్రయాలు అంతిమం. తిరిగి చెల్లింపు కోసం కొనుగోలును ఉపసంహరించడానికి, రద్దు చేయడానికి లేదా కొనుగోళ్లను వాపసు చేయడానికి మీ హక్కుల గురించి మరింత సమాచారం కోసం Google Play యొక్క తిరిగి చెల్లింపు విధానాన్ని చూడండి. Google Play యొక్క తిరిగి చెల్లింపు విధానాలు లేదా ప్రదాత యొక్క తిరిగి చెల్లింపు విధానాలలో స్పష్టంగా పేర్కొన్నట్టుగా మినహా అన్ని విక్రయాలు అంతిమమైనవి మరియు వాపసులు, భర్తీలు లేదా తిరిగి చెల్లింపులు అనుమతించబడవు. ఏదైనా లావాదేవీ కోసం భర్తీ, వాపసు లేదా తిరిగి చెల్లింపు మంజూరైతే ఆ లావాదేవీ రద్దు చేయబడుతుంది మరియు మీరు ఆ లావాదేవీ ద్వారా పొందిన కంటెంట్‌ని ఇకపై యాక్సెస్ చేయలేరు.
సభ్యత్వాలు. సభ్యత్వాలు ప్రతీ బల్లింగ్ వ్యవధికి (అది వారమైనా, నెల అయినా, సంవత్సరం అయినా లేదా మరే వ్యవధి అయినా) స్వయంచాలకంగా ఛార్జీ విధించబడతాయి మరియు ప్రతీ బల్లింగ్ వ్యవధి ప్రారంభానికి ముందు 24 గంటలు దాటకుండానేే మీకు ఛార్జీ విధించబడవచ్చు.
(a) ట్రయల్ వ్యవధులు. మీరు ధర కోసం కంటెంట్‌కు సభ్యత్వం తీసుకుంటే, నిర్దిష్ట ట్రయల్ వ్యవధి కోసం ఛార్జీ లేకుండానే మీరు సభ్యత్వ ప్రయోజనాలకు యాక్సెస్ పొందవచ్చు, ఆ తర్వాత మీరు మీ సభ్యత్వాన్ని రద్దు చేసేంతవరకూ మీకు ఛార్జీ విధించబడుతుంది. ఛార్జీలను నివారించడానికి ట్రయల్ వ్యవధి ముగింపుకు ముందే మీరు రద్దు చేయాలి. మీరు మీ ట్రయల్‌ని రద్దు చేసిన తర్వాత, వేరేగా పేర్కొంటే మినహా మీరు వెంటనే సంబంధిత యాప్‌కు మరియు ఏవైనా సభ్యత్వ సదుపాయాలకు యాక్సెస్‌ని కోల్పోతారు. అందించిన వ్యవధి సమయంలో ప్రతీ వినియోగదారు కోసం నిర్దిష్టమైన ట్రయళ్లకు లేదా ఇతర పరిమితులకు అలాంటి ట్రయల్ వ్యవధుల యాక్సెస్ పరిమితం చేయబడుతుంది.
(b) రద్దులు. సహాయ కేంద్రంలో పేర్కొన్నట్టుగా వర్తించే బిల్లింగ్ వ్యవధి ముగిసే లోపు మీరు ఎప్పుడైనా సభ్యత్వాన్ని రద్దు చేసుకోవచ్చు, మరియు ఆ రద్దు వచ్చే వ్యవధికి వర్తిస్తుంది. ఉదాహరణకు, మీరు నెలవారీ సభ్యత్వాన్ని కొనుగోలు చేస్తే, దాన్ని మీరు ఏ సభ్యత్వ నెలలోనైనా, ఏ సమయంలోనైనా రద్దు చేయవచ్చు మరియు సభ్యత్వం ఆ మరుసటి నెలలో రద్దు అవుతుంది. మీరు Google Play వాపసు విధానంలో అందిస్తే మినహా ప్రస్తుత బిల్లింగ్ వ్యవధికి వాపసు స్వీకరించారు (ఉదాహరణకు కంటెంట్ లోపపూర్వకంగా ఉంటే). Google Play న్యూస్‌స్టాండ్ సభ్యత్వాలు: మీరు ప్రస్తుత బిల్లింగ్ వ్యవధిలోని మిగిలిన సమయంలో సంబంధిత సభ్యత్వం యొక్క కంటెంట్ మరియు అప్‌డేట్‌లను (వర్తిస్తే) స్వీకరించడం కొనసాగిస్తారు. ఆ బిల్లింగ్ వ్యవధి ముగిసిన తర్వాత, ఇంతకుముందు బట్వాడా చేయబడిన మ్యాగజైన్ సంచికలకు యాక్సెస్‌ను మీరు అలాగే కలిగి ఉంటారు, కానీ మీరు సభ్యత్వాన్ని రద్దు చేసిన బిల్లింగ్ వ్యవధి ముగిసినప్పుడు విక్రయ వార్తల కంటెంట్‌కు ఉన్న మీ యాక్సెస్ రద్దు అవుతుంది. మీరు ఉచిత ట్రయల్ వ్యవధిలో రద్దు చేస్తే, మీరు ఉచిత ట్రయల్ వ్యవధిలో యాక్సెస్ చేసే వార్తాపత్రిక సంచికలకు యాక్సెస్‌ని కలిగి ఉంటారు కానీ మీరు వార్తల కంటెంట్‌కు యాక్సెస్ కలిగి ఉండరు. Google Play సంగీతం సభ్యత్వాలు: మీరు మీ Google Play సంగీతం సభ్యత్వాన్ని రద్దు చేస్తే, మీరు Google Play సంగీతం సభ్యత్వ కంటెంట్‌ను ప్రస్తుత బిల్లింగ్ వ్యవధిలోని మిగిలిన సమయంలో యాక్సెస్ కొనసాగుతుంది; అయితే, మీ సభ్యత్వం రద్దు అయిన బిల్లింగ్ వ్యవధి ముగింపులో మీ యాక్సెస్ రద్దు అవుతుంది. మీరు ఉచిత ట్రయల్ వ్యవధిలో Google Play సంగీతం సభ్యత్వాన్ని రద్దు చేస్తే, ఉచిత ట్రయల్ వ్యవధిలో మీరు Google Play సంగీతం సభ్యత కంటెంట్‌కి మీరు కలిగి ఉన్న యాక్సెస్‌ని కోల్పోతారు.
(c) ముద్రణ సభ్యుల కోసం తగ్గింపులు. మీరు అప్పటికే ముద్రణ సభ్యులు అయి ఉంటే Google Playలో తగ్గింపు ధరకు పత్రికల కంటెంట్ యొక్క సభ్యత్వాన్ని కొనుగోలు చేసే అవకాశాన్ని కొన్ని పత్రికల ప్రదాతలు మీకు కల్పించవచ్చు. మీరు ఆ పత్రిక యొక్క ముద్రణ సబ్యత్వాన్ని రద్దు చేస్తే లేదా దాని గడువు ముగిసిపోయి మళ్లీ పునరుద్ధరించకపోతే, Google Playలో కంటెంట్ యొక్క తగ్గింపు ధరకు పొందిన మీ సభ్యత్వం స్వయంచాలకంగా రద్దు అవుతుంది.
(d) ధర మార్పులు. మీరు సభ్యత్వాన్ని కొనుగోలు చేస్తే, ప్రారంభంలో మీకు సభ్యత్వ ఒప్పంద సమయంలో వర్తించిన ధరకు మీకు ఛార్జీ విధించబడుతుంది. సభ్యత్వ ధర తర్వాత పెరిగితే, Google మీకు తెలియజేస్తుంది. నోటీసు ఇచ్చిన తర్వాత మీ రాబోయే చెల్లింపుకు ఈ పెంపు వర్తిస్తుంది, కనీసం ఛార్జీ విధించే 10 రోజుల ముందు మీకు నోటీసు ఇవ్వబడుతుంది. మీకు నోటీసు 10 రోజుల కంటే తక్కువ సమయంలో ఇచ్చినట్టయితే, ధర పెంపు వచ్చే చెల్లింపు గడువు తర్వాత వరకూ వర్తించదు. మీరు సభ్యత్వం కోసం పెంచిన ధర మేరకు చెల్లించకూడదనుకుంటే, ఈ నిబంధనల యొక్క రద్దుల విభాగంలో పేర్కొన్నట్టుగా మీరు సభ్యత్వాన్ని రద్దు చేసుకోవచ్చు, ఈ విషయాన్ని మీరు మాకు ప్రస్తుత బిల్లింగ్ వ్యవధి ముగిసే సమయానికి ముందే తెలియజేస్తే సభ్యత్వం కోసం తదుపరి ఛార్జీలు మీకు విధించబడవు. ప్రదాత సభ్యత్వ ధరను పెంచి మరియు సమ్మతి అవసరమైన సమయంలో మీరు కొత్త ధరను అంగీకరిస్తే మినహా Google మీ సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చు. మీ సభ్యత్వం రద్దు అయి, తర్వాత మీరు మళ్లీ సభ్యత్వం తీసుకోవాలని నిర్ణయిస్తే, మీకు అప్పటి సభ్యత్వ ధర ప్రకారంగా ఛార్జీ విధించబడుతుంది.
4. హక్కులు మరియు పరిమితులు
కంటెంట్‌ని ఉపయోగించడానికి లైసెన్స్. లావాదేవీని పూర్తి చేసిన తర్వాత లేదా కంటెంట్ కోసం వర్తించే రుసుమును చెల్లించిన తర్వాత ఈ నిబంధనల్లో మరియు అనుబంధ విధానాల్లో స్పష్టంగా అనుమతించినట్టుగా వర్తించే కంటెంట్ యొక్క కాపీలను నిల్వ చేయడానికి, యాక్సెస్ చేయడానికి, చూడడానికి, ఉపయోగించడానికి మరియు మీ పరికరాలలో ప్రదర్శించడానికి అవిశిష్ట హక్కును మీరు కలిగి ఉంటారు లేదంటే మీ వ్యక్తిగత, వాణిజ్య యేతర ఉపయోగం కోసం మాత్రమే మంజూరు చేయబడుతుంది. Google Playలోని నిబంధనల్లో ప్రత్యేకించబడిన అన్ని హక్కులు, శీర్షిక మరియు ఆసక్తి మీకు స్పష్టంగా మంజూరు చేయబడలేదు. యాప్‌లు మరియు గేమ్‌ల యొక్క మీ వినియోగం మీకు మరియు ప్రదాతకు మధ్య తుది వినియోగదారు ఒప్పంద అదనపు నిబంధనలు మరియు షరతుల ద్వారా పర్యవేక్షించబడుతుంది.
లైసెన్స్ నిబంధనల ఉల్లంఘన. మీరు ఏవైనా నిబంధనలను ఉల్లంఘిస్తే, ఈ లైసెన్స్ ద్వారా లభించిన మీ హక్కులు వెంటనే రద్దు చేయబడతాయి మరియు Google Play, కంటెంట్ లేదా మీ ఖాతాకు ఉన్న మీ యాక్సెస్‌ని మీకు తిరిగి చెల్లించకుండానే Google రద్దు చేయవచ్చు.
పరిమితులు: మీరు వీటిని చేయలేకపోవచ్చు:
- (a) కింద పేర్కొన్న ఉపయోగం కాపీరైట్‌ని లేదా ఏవైనా ఇతర వర్తించే హక్కును ఉల్లంఘించనప్పుడు లేదా (b) ప్రత్యేకించి అనుమతించబడి మరియు విధానాలను పేర్కొన్నట్టుగానే అనుసరిస్తే మినహా బహిరంగ ప్రదర్శనలో భాగంగా లేదా ఎలాంటి రుసుమూ విధించనప్పుడు కూడా కంటెంట్‌ని ప్రదర్శించడం (పాక్షికంగా లేదా మొత్తంగా).
- ప్రత్యేకంగా అనుమతించబడి మరియు విధానాలను ఖచ్చితంగా పేర్కొన్నట్టుగానే అనుసరిస్తే మినహా Google Play ద్వారా మీరు పొందిన కంటెంట్ యొక్క ఏవైనా డౌన్లోడ్లకు సంబంధించి కూడా ఏదైనా మూడవ పక్షానికి కంటెంట్‌ని అమ్మడం, అద్దెకు ఇవ్వడం, లీజుకు ఇవ్వడం, తిరిగి పంపిణీ చేయడం, ప్రసారం చేయడం, కమ్యూనికేట్ చేయడం, సవరించడం, ఉప లైసెన్స్‌ని ఇవ్వడం, బదిలీ చేయడం లేదా కేటాయించడం.
- మీకు ప్రసార రూపంలో సమర్పించిన ఏదైనా కంటెంట్‌ని రికార్డ్ చేయడానికి లేదా దాని కాపీని సృష్టించడానికి ప్రసారాన్ని రికార్డ్ చేసే స్ట్రీమ్ రిప్పింగ్, స్ట్రీమ్ క్యాప్చర్ లేదా అలాంటి సాఫ్ట్‌వేర్‌తో కలిపి Google Playని లేదా ఏదైనా కంటెంట్‌ని ఉపయోగించడం.
- ప్రత్యేకంగా అనుమతించబడి మరియు విధానాలను ఖచ్చితంగా పేర్కొన్నట్టుగానే అనుసరిస్తే మినహా సేవను షేర్ చేయడం, రుణంగా తీసుకోవడం లేదా బహుళ-వ్యక్తుల ఉపయోగంలో భాగంగా లేదా ఏదైనా ఇతర సంస్థ ప్రయోజనం కోసం కంటెంట్‌ని ఉపయోగించండి.
- ఏదైనా కంటెంట్‌కు లేదా Google Playకు యాక్సెస్‌ని రక్షించే, కలుషీకరణం చేసే లేకపోతే పరిమితం చేసే ఏవైనా భద్రతా ఫీచర్‌లు లేదా అంశాలను దాటవేయడానికి, నిలిపివేయడానికి, అధిగమించడానికి ప్రయత్నించడం లేదా ఇతరులకు సహకరించడం, అధికారాన్ని మంజూరు చేయడం లేదా ప్రోత్సహించడం.
- కంటెంట్‌లో చేర్చిన ఏవైనా వాటర్‌మార్క్‌లను, లేబుళ్లను లేదా ఇతర చట్టపరమైన లేదా యాజమాన్య నోటీసులను తీసివేయడం లేదా గుర్తింపును దాచి చేసే చర్య కోసం లేదా కంటెంట్ యొక్క యాజమాన్యాన్ని లేదా మూలాన్ని సూచించే వివరాలను మార్చడంతో సహా Google Play ద్వారా పొందిన కంటెంట్‌ని సవరించే ప్రయత్నం చేయడం.
మూడవ పక్ష నిబంధనలు. ఈ నిబంధనల్లో ఏదైనా భిన్నంగా ఉన్నప్పటికీ, ఈ నిబంధనల కింద తమ కంటెంట్‌కి ("మూడవ పక్ష నిబంధనలు") నేరుగా సంబంధముండే నిర్దిష్ట నిబంధనల కింద ఉద్దేశించిన మూడవ పక్ష లబ్దిదారులు అన్నవారు Googleకి తమ కంటెంట్ యొక్క లైసెన్స్‌ని ఇచ్చే మూడవ పక్షాలు మరియు ఇవి అలాంటి కంటెంట్‌పై తమ హక్కులను అమలు చేయడానికి అలాంటి మూడవ పక్షాలను సమాయత్తం చేయడం కోసం మాత్రమే. స్పష్టంగా చెప్పాలంటే, ఈ నిబంధనల్లో సూచిస్తూ పొందుపరిచిన లేదా పొందుపరచకుండా సూచించిన ఏవైనా నియమాలు లేదా ఒప్పందాలు కలిగి ఉండి, కానీ వాటికే పరిమితం కాని మూడవ పక్ష నియమాల వెలుపల ఉండే ఏదైనా నియమానికి సంబంధించి ఈ నిబంధనల్లో ఏదీ ఎలాంటి పక్షంపైనైనా మూడవ పక్ష లబ్దిదారుల హక్కును చర్చించదు.
Play విధానాలు. Google Playలో సమీక్షలు పోస్ట్ చేయడం ఈ కింది విధానాలకు లోబడి ఉంటుంది. మీరు దుర్వినియోగాన్ని లేదా ఇతర కంటెంట్ ఉల్లంఘనలను నివేదించాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.
పాడైన కంటెంట్. మీ ఖాతా ద్వారా మీకు కంటెంట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, వీలైనంత త్వరగా పేర్కొన్నట్టుగానే అది పనిచేస్తుందో లేదో మీరు తనిఖీ చేయాలి మరియు ఏవైనా ఎర్రర్‌లు లేదా లోపాలు కనుగొనబడితే వీలైనంత త్వరగా మాకు లేదా ప్రదాతకు తెలియజేయాలి. మరింత సమాచారం కోసం Google Play తిరిగి చెల్లింపు విధానంని చూడండి.
కంటెంట్ తీసివేత లేదా అలభ్యత. నిబంధనల ప్రకారం, మీరు కొన్న లేదా ఇన్‌స్టాల్ చేసిన కంటెంట్ Google Play ద్వారా మీరు ఎంచుకున్న కాలవ్యవధి వరకు అందుబాటులో ఉంటుంది, అద్దె వ్యవధి కోసం కొనుగోలు చేసిన సందర్భంలో లేదా ఇతర సందర్భాల్లో అలాంటి కంటెంట్‌ని మీకు ఎంత సమయం వరకు అందుబాటులో ఉంచాలన్న అధికారం Google కలిగి ఉంటుంది. నిర్దిష్ట సందర్భాల్లో (ఉదాహరణకు సంబంధిత అధికారాలను కోల్పోతే, సేవ లేదా కంటెంట్ నిలిపివేయబడితే, క్లిష్టమైన భద్రతా సమస్యలు ఉంటే లేదా వర్తించే నిబంధనలు లేదా చట్టం ఉల్లంఘించబడితే) Google మీరు కొనుగోలు చేసిన నిర్దిష్ట కంటెంట్‌కు యాక్సెస్‌ని మీ పరికరం నుండి తీసివేయవచ్చు లేదా నిలిపివేయవచ్చు. Google Ireland Limited విక్రయించిన కంటెంట్‌కు, అలాంటి తీసివేత లేదా నిలిపివేత ఏమైనా ఉంటే సాధ్యమైనప్పుడు మీకు నోటీసు అందించబడవచ్చు. అలాంటి తీసివేత లేదా నిలిపివేతకు ముందు మీరు కంటెంట్ యొక్క కాపీని డౌన్‌లోడ్ చేయలేకపోతే, Google మీకు (a) సాధ్యమైతే కంటెంట్‌కు బదులుగా మరో కంటెంట్‌ని అందిస్తుంది లేదా (b) కంటెంట్ యొక్క ధరకు సంబంధించి మొత్తం డబ్బును లేదా కొంత డబ్బును తిరిగి చెల్లిస్తుంది. Google మీకు తిరిగి చెల్లిస్తే, ఆ తిరిగి చెల్లింపు అన్నది మాత్రమే పరిహారం పొందే మీ స్వంత హక్కు అవుతుంది.
బహుళ ఖాతాలు. మీరు వేర్వేరు వినియోగదారు పేర్లతో బహుళ ఖాతాలు కలిగి ఉండి, అలాంటి ఖాతాలకు మీరే యజమాని అయి మరియు ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు కంటెంట్‌ని బదిలీ చేయాల్సిన సందర్భంలో ఆ పనిని పూర్తి చేయడానికి Google సంబంధిత సేవ యొక్క ఫీచర్‌ని ప్రారంభించింది.
పరికరాలలో యాక్సెస్‌పై పరిమితులు. మీరు కంటెంట్‌ని యాక్సెస్ చేయడానికి ఉపయోగించే పరికరాలు లేదా సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ల సంఖ్యపై Google ఎప్పటికప్పుడు పరిమితులు విధించవచ్చు. Google Play సంగీతం లేదా Google Play సినిమాలు & టీవీ కోసం పరిమితుల గురించి మరింత సమాచారం కోసం దయచేసి మా Google Play సంగీత కేంద్రం పేజీ లేదా Google Play సినిమాలు & టీవీ వినియోగ నిబంధనలను చూడండి.
ప్రమాదకర చర్యలు. సేవలు లేదా కంటెంట్ అణు కేంద్ర నిర్వహణ, జీవ మద్దతు వ్యవస్థ, అత్యవసర కమ్యూనికేషన్‌లు, వైమానిక నావిగేషన్ లేదా కమ్యూనికేషన్ వ్యవస్థలు, వాయు మార్గ రద్దీ నియంత్రణ వ్యవస్థలు లేదా విఫలమైతే మరణానికి, గాయపడడానికి, తీవ్ర భౌతిక లేదా పర్యావరణ నష్టానికి దారి తీయగల అవకాశం ఉండే సేవలలో ఉపయోగించడానికి కాదు.
Google Play చలన చిత్రాలు & TV. Google Play సినిమాలు & టీవీ యొక్క మీ యాక్సెస్ మరియు వినియోగానికి సంబంధించి అదనపు వివరాలు మరియు పరిమితుల కోసం Google Play సినిమాలు & టీవీ వినియోగ నిబంధనలను చూడండి.
Google Play సంగీతం
సంగీత ఫైళ్లు, సంగీత వీడియో ఫైళ్లు, ప్రివ్యూలు, క్లిప్‌లు, కళాకారుల సమాచారం, వినియోగదారు సమీక్షలు, నిపుణులైన మూడవ పక్ష సంగీత సమీక్షలు మరియు ఇతర డిజిటల్ కంటెంట్ వంటి పలు రకాల డిజిటల్ సంగీతం మరియు సంగీత సంబంధ కంటెంట్‌ని బ్రౌజ్ చేయడానికి, ప్రివ్యూ చేయడానికి, ప్రసారం చేయడానికి, డౌన్‌లోడ్ చేయడానికి, సిఫార్సు చేయడానికి మరియు ఉపయోగించడానికి Google Play మిమ్మల్ని అనుమతిస్తుంది ("సంగీత ఉత్పత్తులు").
నిల్వ చేసిన కంటెంట్. మీరు ప్రతీది కింద నిర్వచించినట్టుగా సంగీత సాఫ్ట్‌వేర్ ద్వారా సంగీత నిల్వలో డిజిటల్ కంటెంట్‌ని (సంగీత ఫైళ్లు, సంబంధిత మెటాడేటా మరియు ఆల్బమ్ ఆర్ట్ వంటివి) నిల్వ చేయడానికి Google Playని ఉపయోగించవచ్చు ("నిల్వ చేసిన కంటెంట్"). సందేహం కలగకుండా చేయడానికి, "సంగీతం ఉత్పత్తులు" నిల్వ చేసిన కంటెంట్‌ని కలిగి ఉండవు. నిల్వ చేసిన కంటెంట్‌లో మీరు నేరుగా సంగీత నిల్వకు అప్‌లోడ్ చేసిన ఫైళ్లు లేదా మీ పరికరంలో స్థానికంగా నిల్వ చేయబడిన ఫైళ్లకు Google "స్కాన్ చేసి, సరిపోల్చే" ఫైళ్లు ఉండవచ్చు.
సంగీత లాకర్ సేవలు. Google Play మీకు (a) సంగీత ఉత్పత్తులు మరియు నిల్వ చేసిన కంటెంట్‌తో సహా సంగీతం మరియు సంబంధిత డేటా ఫైళ్లను నిల్వ చేయడానికి మీరు ఉపయోగించే సర్వర్ స్పేస్‌కు ("సంగీత నిల్వ") లేదా (b) సంగీత నిల్వ ద్వారా అప్‌లోడ్ చేయడానికి, నిర్వహించడానికి, యాక్సెస్ చేయడానికి మరియు సంగీతాన్ని ప్లే చేయడానికి మిమ్మల్ని అనుమతించే ("సంగీత సాఫ్ట్‌వేర్") సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లు (వెబ్, డెస్క్‌టాప్ మరియు మొబైల్ అప్లికేషన్‌లు) మరియు సంబంధిత సేవలకు యాక్సెస్‌ని ఇవ్వవచ్చు. సంగీత లాకర్ సేవ" వలె సంగీత నిల్వ మరియు సంగీత సాఫ్ట్‌వేర్ ఉమ్మడిగా ఈ నిబంధనల్లో సూచించబడ్డాయి.
సంగీత లాకర్ సేవల ఉపయోగం. సంగీత నిల్వలో సంగీత ఉత్పత్తులను మరియు నిల్వ చేసిన కంటెంట్‌ని నిల్వ చేయడం ద్వారా మీరు అలాంటి కంటెంట్ యొక్క ప్రత్యేక కాపీని నిల్వ చేస్తున్నారు మరియు దాన్ని మీ తరఫున అట్టిపెట్టమని మరియు Google Playలో మీ ఖాతా ద్వారా మీకు దాని యొక్క యాక్సెస్ ఇవ్వమని మీరు Googleని అభ్యర్థిస్తున్నారు. సంగీత లాకర్ సేవలను ఉపయోగించి , మీరు సంగీత ఉత్పత్తులు మరియు నిల్వ చేసిన కంటెంట్‌ని మీరు ఉపయోగించేలా చేయడం కోసం సంగీత లాకర్ సేవల యొక్క అవసరమైన అన్ని ఫంక్షన్‌లు మరియ ఫీచర్‌లను మీకు అందుబాటులో ఉంచాల్సిందిగా Googleని అభ్యర్థిస్తున్నారు. సంగీత లాకర్ సేవలను అందించడంలో అవసరమైన సాంకేతిక దశలను మీకోసం అమలు చేస్తున్నప్పుడు Google (a) వివిధ నెట్‌వర్క్‌ల ద్వారా మరియు వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా సంగీత ఉత్పత్తులు మరియు నిల్వ చేసిన కంటెంట్‌ని ప్రసారం చేయవచ్చు మరియు (b) కనెక్ట్ చేసే నెట్‌వర్క్‌లు, పరికరాలు, సేవలు లేదా ప్రసార మాధ్యమాల యొక్క సాంకేతిక అవసరాలకు సంగీత ఉత్పత్తులు మరియు నిల్వ చేసిన కంటెంట్‌కి అనుగుణంగా మరియు అనుకూలంగా చేసేందుకు అవసరమైనటువంటి మార్పులను సంగీత ఉత్పత్తులకు మరియు నిల్వ చేసిన కంటెంట్‌కు చేయవచ్చు. Googleకి మీరు సంగీత నిల్వలో అప్‌లోడ్ చేయాల్సిందిగా లేదా నిల్వ చేయాల్సిందిగా చెప్పే ఏదైనా నిల్వ చేసిన కంటెంట్‌ని సంగీత నిల్వలో నిల్వ చేసేందుకు మరియు ఈ విభాగంలో పేర్కొన్నట్టుగా చర్యలు అమలు చేయాల్సిందిగా Googleకి సూచించే అవసరమైన అధికారాలు కలిగి ఉన్నారని Googleకి మీరు నిర్ధారిస్తారు మరియు హామీ ఇస్తారు.
ఇతర Google సభ్యత్వ సేవలు. Google Play మరియు ఎలాంటి Google Play సంగీతం సభ్యత్వ ఉత్పత్తి అయినా ఈ నిబంధనలతోనే పర్యవేక్షించబడతాయి కానీ మీకు Google Play సంగీతం సభ్యత్వానికి యాక్సెస్ ఇచ్చే ఇతర Google ఉత్పత్తితో సహా ఇతర Google ఉత్పత్తి యొక్క నిబంధనలతో కాదు.
Google Play న్యూస్‌స్టాండ్.
పత్రిక ప్రచురణకర్తలతో Google షేర్ చేసే సమాచారం. మీరు Google Playలో ఎంతటి కాలానికైనా పత్రికా సభ్యత్వాన్ని కొనుగోలు చేస్తే, Google మీ పేరు, ఇమెయిల్ చిరునామా, మెయిలింగ్ చిరునామా మరియు ప్రత్యేక ఐడెంటిఫైయర్‌ని పత్రిక ప్రచురణకర్తతో షేర్ చేయవచ్చు. పత్రికకు ఒక ప్రచురణకర్తగా, Google మీ పఠన చరిత్రను పత్రికలోనే ప్రచురణకర్తతో కూడా షేర్ చేయవచ్చు. ప్రచురణకర్త యొక్క గోప్యతా విధానానికి అనుగుణంగా పత్రిక ప్రచురణకర్త ఈ సమాచారాన్ని ఉపయోగిస్తారని పత్రిక ప్రచురణకర్తతో Google అంగీకరించింది. మీరు కొనుగోలు చేస్తున్న సభ్యత్వానికి సంబంధించని ప్రచురణకర్త నుండి ఎలాంటి కమ్యూనికేషన్‌లని అయినా నిలిపివేయడానికి మరియు మీరు సభ్యత్వాన్ని కొనుగోలు చేసే సమయంలో మూడవ పక్షం నుండి మార్కెటింగ్ కమ్యూనికేషన్‌లని నిలిపివేయడానికి మీకు అవకాశం ఇవ్వబడుతుంది. మీరు Google Playలో మ్యాగజైన్ యొక్క ఒక సంచికను కొనుగోలు చేస్తే, Google మీ పోస్టల్ కోడ్‌ని మ్యాగజైన్ యొక్క ప్రచురణకర్తకు అందించవచ్చు. మేము పత్రిక కొనుగోళ్లపై విక్రయాల సమాచారాన్ని కూడా పత్రిక ప్రచురణకర్తలకు అందిస్తాము.
ముద్రణ సభ్యత్వాల ధృవీకరణ. మీరు పత్రిక ప్రచురణకర్త నుండి అప్పటికే ఉన్న ముద్రణ సభ్యత్వం ద్వారా Google Play న్యూస్‌స్టాండ్‌లో సభ్యత్వాన్ని యాక్సెస్ చేస్తుంటే, పత్రిక ప్రచురణకర్తతో ఉన్న ముద్రణ సభ్యత్వాన్ని ధృవీకరించడానికి మేము మూడవ పక్ష సేవా ప్రదాతను అడగవచ్చు మరియు అలా చేయడానికి మేము మిమ్మల్ని మీ ముద్రణ సభ్యత్వానికి సంబంధించిన నిర్దిష్ట సమాచారం కోసం అడగవచ్చు. Google యొక్క గోప్యతా విధానానికి అనుగుణంగా మేము ఈ సమాచారాన్ని ఉపయోగిస్తాము.